రాజయోగ మార్గము - రాజయోగ - యోగమాయా - మహాయోగ -మహా మాయా - కుండలిని యోగ

by Chandra Sekhar Sharma


Posted on 5/13/2020 5:19:58 PMమంత్ర ,లయ ,హఠ ,ఙ్ఞాన యోగముల ను భేదభావం తో ఒకే మహాయోగమును నాల్గు విధములుగా చెప్పబడుతున్నది .హఠ యోగ,మంత్ర యోగములు లయాయోగము యొక్క అంగభూతములే . యోగవేత్తలు ,మహర్షులు లయ యోగమునకు తొమ్మిది అంగముల గా తెలిపారు .యమము ,నియమము ,స్థూలక్రియా ,సూక్ష్మక్రియ ,ప్రత్యాహారము ,ధారణ ,ధ్యానము ,లయ క్రియ ,సమాధి , అనునవి లయ యోగములు. . హ అనగా సూర్యుడు  ఠ అనగా చంద్రుడు ,ఈరెండిటి సంయోగమే హఠయోగము .సూర్య చంద్ర నాడుల సంయోగమే హఠయోగము .

                మంత్ర ,లయ ,హఠ ,ఙ్ఞాన యోగముల ను భేదభావం తో ఒకే మహాయోగమును నాల్గు విధములుగా చెప్పబడుతున్నది .హఠ యోగ,మంత్ర యోగములు లయాయోగము యొక్క అంగభూతములే . యోగవేత్తలు ,మహర్షులు లయ యోగమునకు తొమ్మిది అంగముల గా తెలిపారు .యమము ,నియమము ,స్థూలక్రియా ,సూక్ష్మక్రియ ,ప్రత్యాహారము ,ధారణ ,ధ్యానము ,లయ క్రియ ,సమాధి , అనునవి లయ యోగములు. . హ అనగా సూర్యుడు  ఠ అనగా చంద్రుడు ,ఈరెండిటి సంయోగమే హఠయోగము .సూర్య చంద్ర నాడుల సంయోగమే హఠయోగము . వసిష్ఠ వచనము ప్రకారము మిగిలిన ఉపాయములు వదలి హఠయోగము చే మనో నిరోధము చేయువారు దీపమునువదలి తమస్సు అనే అంజనము చేత నిరోధము చేయువారని తెలియుచున్నది. 

                మంత్ర యోగమునకు ఉపాసన ఆధారము ,ఉపాసనకు మంత్రము ఆధారము .క్షరము కానిది అక్షరము . అక్షరమ్ బహ్మ సమ్మితమ్ . మంత్రమనగా శక్తిమయ శబ్ద మయ స్వరూపము . గురువుచే సాంప్రదాయ పద్దతిలో ఉపదేశించబడునది . ప్రతిశబ్దమునకు ఒక నాదము ,స్వరము ,శక్తి ,పరిమాణము ,అగ్రము ,లోతు ,అంతము ,కంపన ,స్పందన ,రాగము ,శ్రావ్యత ,తంత్రి ,నాళము ,ఉచ్చారణ ,ఆర్తి,తపన అన్నియు కలిపిన సమూహమే మంత్ర స్వరూపము . యంత్రము మంత్రము నుండి ఉద్భవించినదే . మంత్రమే దేవత ,దేవతే మంత్రము , ఈ రెండింటికి భేదము లేదు. మంత్ర యోగము ద్వారా ఙ్ఞాన, లయ .రాజ యోగములు సమాధి స్థితి సిద్దించును . 
                 ధ్యానము :- సమాధి స్థితికి ధ్యానము ముఖ్య సాధనము . ఇది రెండు విధములు గ యున్నది .సగుణధ్యానము ,నిర్గుణ ధ్యానము . శుద్ధమగు మనసుతో ఆత్మ ను తెలుసుకొనుట నిర్గుణధ్యానము .సగుణధ్యానము అనగా మూర్తి ధ్యానము అనబడును. ధ్యానమే జీవులకు బంధమోక్షములకు మూలభూతమగుచున్నది. ధ్యాత యొక్క మనస్సు ధ్యేయమందు లయము చెందినచో ధ్యానము సిద్దించినట్లు భావించబడుచున్నది . మంత్ర ,హఠ, లయ యోగముల యందు స్థూలధ్యానము క్రమముగా మూర్తిధ్యానము ,జ్యోతిర్ధ్యానము , బిందుధ్యానము అను మూడు విధములు . ఇష్ట దైవము యొక్క విగ్రహమునుగాని పటమునుగాని ధ్యానించిన మూర్తిధ్యానము అనబడును. బ్రహ్మను తేజో మయముగా ధ్యానము చేసిన జ్యోతిర్ధ్యానము అనబడును . బ్రహ్మ మరియు కుండలిని శక్తుల ధ్యానము బిందుధ్యానము అనబడును. మంత్ర యోగములో చెప్పిన స్థూలధ్యానము పంచదేవతోపాసనలను(గణపతి ,సూర్య ,రుద్ర ,విష్ణు ,అంబికా) అనుసరించి పలు రకములుగా ఉండును . బ్రహ్మను తేజోమయం గా కల్పించి ధ్యానించుటను గురుముఖంగా తెలుసుకొనవలెను .
                  సమాధి :- సమాధియోగము ఆరువిధములుగ ఒకొక్క దానికి ఒకొక్క ముద్రను కల్గియుంది . ధ్యానయోగసమాధి యందు శాంభవి ,నాదయోగ సమాధి ఖేచరీ ,రసానంద సమాధికి బ్రామరీ ,లయాయోగ సమాధికి యోనిముద్ర ,భక్తి యోగ సమాధికి భక్తియోగము ,రాజయోగాసమాధికి మనో మార్చనయనం విధానములు చెప్పబడినవి . పైన తెలిపిన అన్ని యోగ విషయములు గురు ముఖముగా నేర్చుకొని సాధన చేయవల్సినవి .అంతేగాని పుస్తకాలలో విషయం సేకరణ చేసి సాధనలు సొంతముగా ప్రయోగములు చేసిన ఫలితము రాకుండుగా ,కొన్ని సమయములందు దుష్పలితములు కూడా సంభవిచు అవకాశాము కలదు . అందుచే ఇటువంటివి సవ్యమైన విధానములో సిద్దులనుండి ,స్థిత ప్రజ్ఞ కల్గి సాధన చేయువారినుండి అభ్యసించవలెను .