శివాలయం - తొంబయ్యేళ్ళ పూజారి గారు

by Siva Kumar Anasuri


Posted on 3/24/2020 12:20:17 PMచిన్న కథ.


ఒక ఊరి లో ఒక పురాతన శివాలయం లో తొమ్మిది పదులు వయస్సు దాటిన ఒక వృద్ధ పూజారి ఉన్నారు. అదే శివాలయ వీడియో డాక్యుమెంటరీ కోసం ఒక బృందం ఆ శివాలయానికి వెళ్లారు. వాళ్ళ పనిలో ప్రస్తావంగా ఒక యువతి ఆ పూజారి గారిని ఇంటర్వ్యూ చేయతలచింది. వాళ్ళ మధ్య సంభాషణ ఇలా సాగింది.యువతి: మీ వయస్సు ఎంత?
పూజారి: 93 సంవత్సరాలు.
యువతి: ఎంత కాలంగా ఈ గుడి లో పని చేస్తున్నారు.
పూజారి: ఊహా తెలిసినప్పటి నుండి.
యువతి: మీరు దేవుడ్ని చూసారా (నవ్వుతూ)
పూజారి: చూడలేదు( నవ్వుతూ)
యువతి: ఎప్పుడూ.. మీకు ఇంత కాలం చేసిన పూజలు వృధా అనిపించ లేదా?
పూజారి: మీ ఉద్దేశ్యం.
యువతి: ఉన్నాడో లేడో తెలియని దేవుడి కోసం మీరు పుట్టినప్పటి నుండి పూజారిగా ఉన్నారు కదా.
పూజారి: (ఆయన కొంచెం ఆలోచించి) మీ ఊరిలో కుక్కలు ఉన్నాయా?
యువతి: ఉన్నాయి.
పూజారి: అవి దొంగలు వస్తే మొరుగుతయా?
యువతి: మెరుగుతాయి.
పూజారి: నిజానికి అవి దొంగను చూసినవి కాదు. ఒక కుక్క మొరిగితే దాని వలన ఇంకొకటి, మరొకటి అంటూ అన్ని మొరగటం మొదలు పెడతాయి. కానీ దొంగని చూసింది ఏ ఒకటో, రెండో మాత్రమే. కుక్కలకే ఒక దానిపై ఒక దానికి అంత నమ్మకం ఉంటే మనుషులు అయిన మనకు ఎంత ఉండాలి. నిజానికి నేను దేవుడిని చూడలేదు కానీ, ఈ శివాలయం లో పూజారిగా ఉన్న మా పూర్వీకులు కొంత మంది తాము దేవుడిని చూశామని చెప్పారు. నేను వారి పారంపర్య లో ఈ గుడి లో పూజలు చేస్తున్నా. ఖచ్చితంగా ఎదో ఒక రోజు దేవుడిని చూస్తాను.

నిజ సంభాషణ ఆధారంగా..

కృతజ్జ్ఞతలు