శిశు జననశాంతి వివరములు -  నవవిధ శిశు జననశాంతి

by Chandra Sekhar Sharma


Posted on 3/18/2020 3:12:49 PMశిశువు జన్మించిన నక్షత్రము ఆధారముగా  దోష కాలమందు ప్రేగులు మెడలో వేసుకొని గాని ,శాంతి నక్షత్రము లందు గాని , అమావాస్య ,గ్రహణకాలమందు ఇతర దోష సమయములందు గండకాలము లందు జన్మించిన నక్షత్ర  జపములు ,గ్రహ దానములు ,హోమములు ,రుద్రాభిషేకములు ,అమ్మవారి కుంకుమ పూజలు వంటివి దోష నివారణార్థం చేసిన మంచి ఫలితములు కలుగునని శాస్త్రములో తెలుపబడినది . శాంతి నక్షత్రములు : అశ్వని ,భరణి ,కృత్తికా ,రోహిణి ,పుష్యమి,ఆశ్లేష ,మఘ ,పుబ్బ ,ఉత్తర ,హస్త ,చిత్త ,విశాఖ ,జేష్ఠా ,పూర్వాభాద్ర ,రేవతి  నక్షత్రము   ల కొన్ని పాదములు శాంతి నక్షత్రములు గా చెప్పబడినవి . పుష్యమి ,పూర్వాషాఢ ,చిత్త ,ఉత్తర లు యందు అమావాస్య ,గ్రహణ ,తప్పక శాంతి ఆచరించుటవవలన దోషములు తగ్గునని శాస్త్రముల యందు తెలుపబడినది. ఈ శాంతి విధానముల లో 9 నవవిధ శాంతులు తెలుపబడినవి. 

శిశువు జన్మించిన నక్షత్రము ఆధారముగా  దోష కాలమందు, ప్రేగులు మెడలో వేసుకొని గాని ,శాంతి  నక్షత్రము లందు గాని , అమావాస్య ,గ్రహణకాలమందు ఇతర దోష సమయములందు గండకాలము లందు  జన్మించిన నక్షత్ర  జపములు ,గ్రహ దానములు ,హోమములు ,రుద్రాభిషేకములు ,అమ్మవారి కుంకుమ పూజలు వంటివి దోష నివారణార్థం చేసిన మంచి ఫలితములు కలుగునని శాస్త్రములో తెలుపబడినది . శాంతి నక్షత్రములు : అశ్వని ,భరణి ,కృత్తికా ,రోహిణి ,పుష్యమి,ఆశ్లేష ,మఘ ,పుబ్బ ,ఉత్తర ,హస్త ,చిత్త ,విశాఖ ,జేష్ఠా ,పూర్వాభాద్ర ,రేవతి  నక్షత్రము   ల కొన్ని పాదములు శాంతి నక్షత్రములు గా చెప్పబడినవి . పుష్యమి ,పూర్వాషాఢ ,చిత్త ,ఉత్తర లు యందు అమావాస్య ,గ్రహణ ,తప్పక శాంతి ఆచరించుటవవలన దోషములు తగ్గునని శాస్త్రముల యందు తెలుపబడినది. ఈ శాంతి విధానముల లో 9 నవవిధ శాంతులు తెలుపబడినవి. 

1) తైలానలోకనము :కంచు లేదా మట్టిమూకుడు నందు తగినంత  తైలము పోసి అందు పగడము ,ముత్యము వుంచి ముందుగా గణపతిని పూజించి ,అనంతరము  తైలపాత్రను         పూజించి తరువాత మూకుడు నందు  తైలములో శిశువు యొక్క ముఖ ప్రతిబింబమును తండ్రి చూడవలెను . 
2) రుద్రాభిషేకము : శక్తానుసారంగా ఏకవారం కానీ ,ఏకాదశ రుద్రాభిషేకము కానీ చేయుట . 
3) సూర్యనమస్కారములు : అరుణ  మంత్రము ఒంటి కాలుపై నిలబడి 108 సార్లు  జపించడము .ఇందుకుగాను   శక్తానుసారంగా ఒకరిని గాని ,ముగ్గురినిగాని,ఐదు గురిని గాని నియమించుట. 
4)మృత్యుంజయ జపం :   శక్తానుసారంగా  బ్రాహ్మణులను నియమించి 1 లక్ష మంత్రం జపమ్ చేసేవిధానం . 
5) నక్షత్రజపం : 27 నక్షత్రాలకు 27 గురు  బ్రాహ్మణులను నియమించి 108 లేదా 1008 జపం చేయుట 
6) గ్రహ జపము  : 9 గ్రహములకు  9 గురు  బ్రాహ్మణులను నియమించి 108 లేదా 1008 జపం చేయుట  
7)హోమము  : నవగ్రహములకు అగ్నిముఖముగా ఆయా గ్రహ శాంతి చేసే విధానము . 
8)సువాసినీ పూజ  : శక్తానుసారంగా  సువాసినులకు బోజన తాంబూలాది వస్త్రములతో పసుపు,కుంకుమలతో  సత్కరించుట . 
9) సమారాధన  : శాంతి కార్యము అయినతరువాత యధాశక్తి గా  బ్రాహ్మణులకు బందు మిత్రులకు అన్నసమారాధన లతో దక్షిణతాంబూలములతో  సత్కరించుట . 

          astrotelugu.com లో శిశుజన నక్షత్ర దోష వివరము ఉచితం గా తెలుసుకొనుటకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి .