శ్రీమత్ శంకరభగవత్పాదులు  వారు రచించిన శ్రీ గురు అష్టకం ( గుర్వాష్టకం ) - శ్రీ గుర్వాష్టకం

by Chandra Sekhar Sharma


Posted on 2/27/2020 1:16:40 AMశ్రీమత్ శంకరభగవత్పాదులు  వారు రచించిన శ్రీ గురు అష్టకం(గుర్వాష్టకం ) , సహస్త్ర కమలమందు ప్రకాశింపబడే పరబ్రహ్మ యొక్క తేజో స్వరూపమ్ మీద ఏకాగ్రత నిలుపుమని చెబుతోంది . గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

1     శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్
       యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్
       మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
       తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
భావం :--
చక్కని శరీర రూపము , అందమైన భార్య  ఉన్నప్పటికి, గొప్ప కీర్తి ప్రతిష్టలు , మేరు పర్వతమంత ధనము  ఉన్నప్పటికీ  గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి ప్రయోజనమ్ ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ?

2.     కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాధి సర్వమ్
        గృహమ్ బాంధవా సర్వ మేతాధి జాతమ్,
        మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
        తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
భార్య, సంపదలు , పుత్రులు, మనుమలు, మంచి గృహము , బంధువులు ఉండి గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ?

3.     షడన్గాది వేదో ముఖే శాస్త్ర విద్య
        కవిత్వాది గద్యమ్, సుపద్యమ్ కరోతి
        మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
       తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
నీవు ఆరు వేదాంగము ల  లోను, నాలుగు వేదముల లోను, పారంగతుడవైనా కాని, గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన గాని,  గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ?

4.    విదేశేషు మాన్య, స్వదేశేషు ధన్య
       సదాచార వృత్తేషు మత్తో న చాన్యా
       మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
       తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
నిన్ను విదేశములయందు గొప్పవానిగా , స్వదేశమందు  ధనవంతునిగా, సదాచార వృత్తి గలవానిగా జీవించు వాడవని పొగడ బడినా, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ?

5.    క్షమా మండలే భూప భూపాల వృందై
       సదా సేవితమ్ యస్య పాదారవిందమ్
       మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
       తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
నీవొక  దేశానికి గొప్ప రాజువైనా, ఎందఱో రాజులచేత ,రారాజులచేత నీ పాదాలు సేవించిబడుతున్న , గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ?

6.    యశో మే గతమ్ భిక్షు దాన ప్రతాప
       జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్
       మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
       తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
నీ దానగుణము వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినా, ప్రపంచం మొత్తం దయ గుణమ్ ప్రసంశనీయం  అయినప్పటికీ , గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ?

7.    న భోగే, న యోగే, న వా వాజి రాజౌ
       న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్
       మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
       తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము నందు అన్నింటిపై నీవు విషయాశక్తి  విడచినప్పటికీ  గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ?

8.     అరణ్యే న వాసస్య గేహే న కార్యే
        న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె
        మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
        తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
నీ మనస్సు ఆరణ్యమందు గాని ,గృహమందు గాని ,నీ  దేహమందు గాని ఏక్కడ సంచరించుచున్న గాని, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ? ఏమి ప్రయోజనమ్  ?

   
ఫలశృతి:
           గురోరష్టకమ్ యః పఠేత్ పుణ్యదేహి
           యతిర్ భూపతిర్, బ్రహ్మచారీ చ గేహీ
           లబేత్ వాంఛితార్థమ్ పదమ్ బ్రహ్మ సజ్ఞమ్
           గురోరుక్త వాక్యే, మనో యస్య లగ్నమ్
ఈ గుర్వాష్టకం ని  ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను సావధానులై విని  ఆచరించదరో  , గురువు తెల్పిన మార్గమును భక్తి శ్రద్ధల తో అనుసరించుచూ , మనస్సును  లగ్నమ్  చేయుదురో , వారు  యోగి ఐన ,రాజైన ,గృహస్తు ఐన  ,సన్యాసి ఐన, బ్రహ్మచారు లైనా, ఎలాంటి వారైనా వారు కోరినవి వారికి లభించి పరబ్రహ్మను చేరుకుందురు.