మహాశివరాత్రి - - ఆది అంతం వెతకలేని భగవత్ తేజో స్వరూపం " శివ స్వరూపం "

by Chandra Sekhar Sharma


Posted on 2/21/2020 1:40:13 AMజన్మానికోక శివరాత్రి అనే పదం అందరి నోట వింటుంటాం . మానవ జన్మ లభించిన తరువాత ఒక్కసారైనా శివరాత్రి నాడు శివారాధన చెయ్యలేక పోతే అజన్మాన్త వృధా ఐపోయినట్లే అనిచెబుతున్నాయ్ వేద శాస్త్రాలు . వృత్తిధర్మం వల్లకాని ఏ ఇతర ధర్మం వల్ల కానీ తీరికలేక పోయినా ,కనీసమ్ ఎవరికి వారికి వీలయిన రీతిలో శివారాధన చెయ్యటం మరువకుడని పని . ఈ శివరాత్రి రోజున శివజపం , నామస్మరణ ,పారాయణము ,ఉపవాసమ్ ,అభిషేకం ,జాగరణ లో ఏదోఒక రూపములో భక్తుల మనసులలో సదాశివుడు. ,శివుని సేవల్లో భక్తులూ వుంటారు . వేదం లో శివుని స్వరూపమ్ ఎన్నో విధాలుగా వర్ణించింది .

              అగ్ని రవియందు శుచిహ్ , అంతరిక్షమందు పావకః ,భూలోకమందు పవమానః గా ఈలోకములను రక్షించు చున్నాడు .అగ్నికి సౌర తేజము తోను వాయు  తేజము తోను కలుగు సమ్మిశ్రణము తో  రుద్రుడు గా శ్రుతులయందు చేపబడెను . 
              పంచాంగ రుద్రార్చనా విధానం లో శివుని పంచముఖ ధ్యానమ్ వివరించింది .ఋగ్వేదం లో రుద్రుని సూక్తమ్ ,యజుర్వేదం లో నమకచమకాలు చెప్పబడ్డాయి . ఈ పంచముఖ రుద్ర స్వరూపుని తత్పురుష ,అఘోర ,సద్యోజాత,వామదేవ ,ఈసనాముఖములలో  ఏ రూపం లో ఐన కొలవవచ్చు ..ఆరణ్యకములందు ,అరుణమందు ఈ రుద్ర భగవానున్ని ఏకాదశ రుద్రులుగా చెప్పబడింది . వాయువు యొక్క  ఏకాదశ భేదములతో   ఏకాదశ రుద్రులు చెప్పబడింది . ప్రభ్రాజమానరుద్రులు ,వ్యవదాత రుద్రులు , వాసుకివైద్యుతరుద్రులు ,రజతరుద్రులు, రుషరుద్రులు,శ్యామరుద్రులు ,కపిలరుద్రులు ,అతిలోహితరుద్రులు ,ఊర్ధ్యరుద్రులు,అవపతన్తరుద్రులు ,  వైద్యుతరుద్రులు గా చెప్పబడినది . 
               తాంత్రికసంప్రదాయము ప్రకారముగా  సృష్టి యందు  గోచరించు  అంశలను 36 గాను 96 గాను వివరించ బడింది. మహాన్యాస ప్రక్రియలలో 81 రూపములతో శివ తత్త్వం స్తుతించబడుతున్నది 
              ప్రధానరుద్రుని నుండి రూపొందిన పదిమంది ,దశ దిశల  వ్యాప్తి ఐ  వీరుమరల ఒక్కొక్కరు పదిమంది చొప్పున నూరుమంది గా (100) రూపొందినారు .వీరే శత రుద్రులు ,అగస్యమహాఋషి చూపినట్లు మహా రుద్రుడు 16 ప్రాకారాల మధ్య 274 మంది తో సేవింపబడుతూ ఉంటాడని వీరు అసంఖ్యాకులుగా రూపొందుతారని వివరించారు .
              శుద్దతత్వ  శివః   శక్తిహ్ సదాశివహ్  ఈశ్వరః శుద్ధవిద్యా  తో 36 గా అంబతో కూడిన శంభుడు సాంబశివుని గా  అంబాసమేతం గా  అసంఖ్యాకులుగా యీ  సృష్టి స్థితి లయలు ని నడిపిస్తూ వుంటారు  

ప్రధమస్తు మహాదేవో  ద్వితీయస్థు మహేశ్వరః 
తృతీయః శంకరో జ్ఞేయ చతుర్దో వృషభధ్వజః 
పఞ్చమః కృత్తివాసాశ్చ  షష్ఠహః కామాంగనాశనః 
సప్తమో దేవదేవేశః శ్రీకంఠశాచాష్టమహః స్మృతః 
ఈశ్వరో నవమో  జ్ఞేయో దశమః పార్వతీపతిః 
రుద్రఏకాదశ శైచవ ద్వాదశః  శివ ఉచ్చతే .  ||


         శ్రీ శివ పంచాక్షరి స్తోత్రమ్ :--

ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ || 1 ||

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమః శివాయ || 2 ||

శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమః శివాయ || 3 ||

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమః శివాయ || 4 ||

యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమః శివాయ || 5 ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

      లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయజ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||